శ్మశాన భూమి దుర్వినియోగం పై హైకోర్టు సీరియస్

April 17, 2026 4:08 PM

శ్మశాన భూముల దుర్వినియోగంపై Andhra Pradesh High Court తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కృష్ణా జిల్లా మొవ్వ గ్రామ పంచాయతీ పరిధిలోని స్మశాన భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.

ప్రధాన న్యాయమూర్తి Dheeraj Kumar Thakur ధర్మాసనం, సర్వే నంబర్ 245/1, 2, 4 కింద ఉన్న భూమిని అంత్యక్రియల కోసం మాత్రమే వినియోగించాలనీ స్పష్టం చేసింది. ఇతర కార్యక్రమాలకు లేదా నిర్మాణాలకు ఈ భూమిని వినియోగించడం చట్ట విరుద్ధమని పేర్కొంది.స్థానికుల అభ్యంతరాల మధ్య స్మశాన భూమిలో ప్లాట్ల కేటాయింపు, హాస్టల్ నిర్మాణం చేపట్టడంపై కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ప్రభుత్వం ప్లాట్ కేటాయింపును వెనక్కి తీసుకున్నప్పటికీ, రూ.3 కోట్లతో వసతి గృహ నిర్మాణం ప్రారంభించడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది.స్మశాన భూమిలో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన న్యాయస్థానం, తదుపరి విచారణను జూన్ 17కి వాయిదా వేసింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media