రాపూరులో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

April 18, 2026 10:20 AM

నెల్లూరు జిల్లా రాపూరు లో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా శ్రీ వినాయక జూనియర్ కళాశాలలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫైర్ సిబ్బంది అగ్ని ప్రమాదాలు ఎలా సంభవిస్తాయో డెమో ద్వారా విద్యార్థులకు వివరించారు.

అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్విప్‌మెంట్ వినియోగం పై ప్రదర్శనలు నిర్వహించారు. అత్యవసర సమయంలో 101 సహా ఇతర హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేయాలని సూచిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.అలాగే విద్యుత్, రోడ్డు ప్రమాదాల సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ అధికారి వి. కుప్పయ్యతో పాటు సిబ్బంది, కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media