అనకాపల్లిలో శ్రీ నూకంభిక అమ్మవారికి ప్రత్యేక పూజలు

April 18, 2026 11:46 AM

అనకాపల్లి తాకాశి వీధిలో స్వయంభూగా వెలసిన శ్రీ నూకంభిక అమ్మవారికి నెలపండుగ అమావాస్య సందర్భంగా శుక్రవారం ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ భీమరశెట్టి రామ్కి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ అన్నసమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ తాకాశి రాజేష్, ధర్మకర్త తాకాశి కన్నబాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ తాకాశి కిషోర్, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, తాకాశి వీధి ప్రజలు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media