మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటమి పై YS JAGAN

April 18, 2026 12:28 PM

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు తిరస్కరణపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ పరిణామం మహిళలకు మాత్రమే కాకుండా దక్షిణ భారతానికి కూడా న్యాయం చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు.

శుక్రవారం సోషల్ మీడియా వేదికగా స్పందించిన జగన్, బిల్లును వ్యతిరేకించిన పార్టీలు తమ వైఖరిపై ఆలోచించుకోవాలని సూచించారు. జనాభా లెక్కల ఆధారంగా జరిగే నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) కారణంగా దక్షిణ రాష్ట్రాలకు లోక్‌సభ సీట్లు తగ్గే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.2026 జనగణన తరువాత పరిస్థితి మరింత ప్రతికూలంగా మారే అవకాశముందని, కుటుంబ నియంత్రణలో క్రమశిక్షణ పాటించిన దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు.ఇక మహిళా రిజర్వేషన్ అమలు మరింత ఆలస్యమవడం కూడా ఆందోళనకరమని జగన్ అభిప్రాయపడ్డారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media