అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA Type-1) వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్వికకు మంత్రి నారా లోకేష్ సాయంతో పునర్జన్మ లభించింది. రూ.16 కోట్ల విలువైన జోల్జెన్స్మా జీన్ థెరపీ ఇంజెక్షన్‌ను విదేశాల నుంచి రప్పించి హైదరాబాద్‌లో విజయవంతంగా అందించారు.

జూబ్లీహిల్స్‌లోని రెయిన్బో ఆసుపత్రిలో మంత్రి లోకేష్ సమక్షంలో వైద్యులు ఇంజెక్షన్ ఇవ్వగా, చిన్నారి ఆరోగ్యం స్థిరపడింది. ఈ సందర్భంగా మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించి, భవిష్యత్తులో కూడా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన పునర్విక చికిత్స కోసం ప్రజల నుంచి భారీగా విరాళాలు సేకరించగా, మిగిలిన మొత్తాన్ని సమీకరించేందుకు మంత్రి లోకేష్ ముందుకొచ్చారు. ఆయన పర్యవేక్షణలోనే ఔషధ కంపెనీలు, ఆసుపత్రి మధ్య సమన్వయం జరిగి చికిత్స ఆలస్యం కాకుండా పూర్తి చేశారు.చిన్నారి ప్రాణాలు కాపాడటంలో సహకరించిన మంత్రి లోకేష్, వైద్యులు, ప్రజలకు పునర్విక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
