మండే ఎండలను లెక్కచేయకుండా మలయాళ నటుడు Fahadh Faasil తన తాజా చిత్రం “Don’t Trouble The Trouble” షూటింగ్లో పాల్గొంటున్నారు.
తీవ్రమైన వేసవి వేడి మధ్య కూడా పూర్తి డెడికేషన్‌తో షూటింగ్ కొనసాగిస్తున్న ఆయనను చూసి చిత్రబృందం ప్రశంసిస్తోంది. షూటింగ్ గ్యాప్‌లలో టీమ్ సభ్యులు కొబ్బరి నీళ్లు, మజ్జిగ తీసుకుంటూ వేడిని తట్టుకుంటున్నారు.హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షూటింగ్లో ఫహాద్ ఫాజిల్ కష్టపడుతూ పని చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది.
