టాలీవుడ్ హీరో Vijay Deverakonda తన కొత్త సినిమా ప్రకటనతో అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించారు. ‘హాయ్ నాన్న’ దర్శకుడు Shouryuv తో కలిసి కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.

‘VDxShouryuv’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విజయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్టర్లో జంతువులు, ఆయుధాలను హైలైట్ చేస్తూ కథపై ఆసక్తి పెంచేలా రూపొందించారు.పోస్టర్ ద్వారా మూవీ టీమ్‌ను కూడా పరిచయం చేసిన విజయ్, ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభం కానుందని వెల్లడించారు. ఈ కొత్త కాంబినేషన్‌పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
