సింగర్ Mangli పై వివాదం: ఇండస్ట్రీ నుంచి బహిష్కరణకు డిమాండ్

April 18, 2026 5:09 PM

ప్రముఖ గాయని Mangliపై వివాదం చెలరేగింది. ఆమెను సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.

అసోసియేషన్ జనరల్ సెక్రటరీ Sampath Naik ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తూ, మైక్రో ఫైనాన్స్ పేరిట డబ్బులు వసూలు చేసిన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కేసులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో మంగ్లీపై కేసు నమోదైంది. బాధిత నిరుపేదలకు న్యాయం జరిగే వరకు మంగ్లీపై బహిష్కరణ కొనసాగించాలని సంపత్ నాయక్ పేర్కొన్నారు.ఈ వ్యవహారం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media