Gachibowli పోలీస్ స్టేషన్ పరిధిలోని టిఎన్జీవో కాలనీలో ఒక అపార్ట్మెంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
బిల్డింగ్ సెల్లార్‌లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో సుమారు 15 ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.మంటల కారణంగా ఇద్దరు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
