రాపూరులో “బడి పిలుస్తోంది” కార్యక్రమం Govt schools ఏ లక్ష్యం

April 20, 2026 5:52 PM

నెల్లూరు జిల్లా Rapur మండలంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి “బడి పిలుస్తోంది”, “మన బడి – జ్ఞాన బాట” కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖాధికారి Srinivasulu తెలిపారు.

సోమవారం రాపూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ స్కూళ్లకు సమానంగా అన్ని సౌకర్యాలు కల్పించామని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని కోరారు.విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, ‘తల్లికి వందనం’, ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం’ వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందిస్తోన్న ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎంఈవో-2 జిలాని భాష, ప్రధానోపాధ్యాయులు అనిల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media