విశాఖపట్నంలోని Simhachalam Templeలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి చందనోత్సవ వేడుకలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తుల దర్శనాలు ప్రారంభమై సజావుగా కొనసాగుతున్నాయి.

అనువంశిక ధర్మకర్త Pusapati Ashok Gajapathi Raju తొలి దర్శనం చేసుకున్న అనంతరం సాధారణ భక్తులకు అనుమతి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ తరఫున Vangalapudi Anitha స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.మంత్రులు Kollu Ravindra, Kondapalli Srinivas కూడా దర్శనాలు చేసుకున్నారు. స్లాట్ విధానంలో క్యూ లైన్లు వేగంగా కదులుతున్నాయి.ఉదయం 3 నుంచి 4.30 గంటల మధ్య సుమారు 6,700 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మెడికల్ సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లు చేశారు.జిల్లా కలెక్టర్ M. Abhishikt పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
