‘మేము అధికారంలోకి రాగానే హైడ్రాను రద్దు చేస్తాం’-KCR

April 21, 2026 10:17 AM

పేదల బతుకులను ఛిద్రం చేస్తోన్న హైడ్రాను తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత జీవన్ రెడ్డి BRS లో చేరుతున్న సందర్భంగా జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చి వేసి వారిని రోడ్డున పడేస్తున్నారని అన్నారు. తాము అధికారంలోకి రాగానే పేదలకు ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. మూసీ నది ప్రాజెక్ట్ పేరుతో పేదలను నిర్వాసితులను చేస్తున్నారంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

సీనియర్ నేత Jeevan Reddyను పార్టీకి ఆహ్వానించి, వెంటనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. ఈ నిర్ణయం బీఆర్‌ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ సందర్భంగా హైడ్రా (HYDRAA) చర్యలపై తీవ్ర విమర్శలు గుప్పించిన కేసీఆర్, పేదల ఇళ్లు కూల్చడం గూండాయిజం అని అభివర్ణించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే హైడ్రాను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.మూసీ నది ప్రాజెక్ట్ పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. “కాంగ్రెస్ వెళ్లాలి – బీఆర్‌ఎస్ రావాలి” అంటూ రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిచ్చారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media