హోర్ముజ్‌లో పట్టుబడ్డ IRAN నౌకలో chemical Missiles? నిక్కీ హేలీ

April 21, 2026 10:50 AM

Strait of Hormuzలో అమెరికా నేవీ స్వాధీనం చేసుకున్న ఇరాన్‌కు చెందిన నౌకపై వివాదం నెలకొంది. ఈ నౌక చైనా నుంచి ఇరాన్‌కు వెళ్తూ మిసైల్ తయారీకి ఉపయోగించే రసాయనాలను తీసుకెళ్తోందని Nikki Haley ఆరోపించారు.

హేలీ ప్రకారం, నౌకను ఆపమని పలుమార్లు హెచ్చరించినప్పటికీ అది ఆదేశాలను పాటించలేదని తెలిపారు. చైనా ఇరాన్‌కు మద్దతు ఇస్తోందన్న అనుమానాలు కూడా వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా, United States Navy ఈ నౌకను గల్ఫ్ ఆఫ్ ఒమాన్ సమీపంలో స్వాధీనం చేసుకుంది. ‘టౌస్కా’ అనే ఈ కంటైనర్ షిప్ ముందుగా కూడా డ్యూయల్-యూజ్ సరుకులను రవాణా చేసినట్లు సమాచారం.అయితే, ఇరాన్ ఈ చర్యను “సాయుధ దోపిడీ”గా అభివర్ణిస్తూ తీవ్రంగా ఖండించింది. అమెరికా విధించిన నౌకాశ్రయ నిర్బంధం తొలగించేవరకు చర్చలకు హాజరుకాబోమని కూడా ప్రకటించింది.ప్రస్తుతం ఈ ఘటన అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media