వాహనంలో తరచూ లోపాలు వస్తున్నాయంటూ దాఖలైన కేసులో ఓలా సంస్థకు వినియోగదారుల కమిషన్ భారీ జరిమానా విధించింది.Hyderbad లోని నల్లగండ్లకు చెందిన సంతోష్ రెడ్డి 2023 నవంబర్ 9న ఓలా వాహనం కొనుగోలు చేసిన తర్వాత నిరంతరం సమస్యలు ఎదురుకున్నారు.

సర్వీస్ సెంటర్‌లో పలుమార్లు రిపేర్ చేయించినప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోవడం తో ఆయన Consumer courtను ఆశ్రయించారు.ఫిర్యాదుదారుడి వాదనలు విన్న Court.. బాధితుడికి వాహనం ధర రూ.1,19,999, ఇన్సూరెన్స్ రూ.7,243తో పాటు కేసు ఖర్చుల కింద రూ.5,000, పరిహారం కింద మరో రూ.5,000 చెల్లించాలని OLA సంస్థను ఆదేశించింది.ఈ తీర్పు వినియోగదారుల హక్కులకు బలమైన మద్దతుగా భావిస్తున్నారు.
