వికారాబాద్ జిల్లాలోని మహిళ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ రైడ్‌లో CI మరియు SIఐ స్థాయి అధికారులు ఏసీబీకి పట్టుబడినట్లు తెలుస్తోంది.
తాండూరు ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది.ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన పోలీసు విభాగంలో చర్చనీయాంశంగా మారింది.
