హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ పోలీసులు బస్సు ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని బంగారం దోచుకుంటున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి దాదాపు 17 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

కొండాపూర్‌కు చెందిన డాక్టర్ డి.ఎస్. కీర్తన అనంతపురం నుంచి హైదరాబాద్‌కు ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఆమె బ్యాగులో ఉన్న సుమారు 20 తులాల బంగారం చోరీకి గురైంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కర్నూలు జిల్లా బుధవారపేటకు చెందిన అన్నారెడ్డి వెంకట శివారెడ్డి (35)ను అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికులు నిద్రలో ఉండగా వారి బ్యాగులను తనిఖీ చేసి బంగారం అపహరించడం ఇతని మోడ్ ఆఫ్ ఆపరేషన్‌గా పోలీసులు వెల్లడించారు.నిందితుడిపై గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో చోరీ చేసిన బంగారం లో 17 తులాలను పోలీసులు రికవరీ చేశారు.కేసును ఛేదించిన అఫ్జల్‌గంజ్ పోలీస్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.
