Jainath ప్రాంతంలో రైతులు శనగల కొనుగోలు కోసం తీవ్ర ఆందోళనకు దిగారు. ప్రభుత్వం పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
రైతులకు మద్దతుగా అఖిలపక్ష నాయకులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగగా, పోలీసులు అక్కడికి చేరుకుని నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.రైతుబంధు సమన్వయ అధ్యక్షుడు లింగారెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 30 వరకు శనగలు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, కోట పూర్తైందని చెప్పి కొనుగోళ్లు నిలిపివేయడం వల్ల రైతులు రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు. లక్షకు పైగా క్వింటాళ్ల శనగ పంట ఉండగా, ప్రభుత్వం కేవలం 24 వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడం దురదృష్టకరమని విమర్శించారు.జొన్నలు, శనగల కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని, రైతులకు న్యాయం జరిగే వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.
