హైదరాబాద్ ki “చెత్త సుద్ధి లేదా”: గుట్టలుగా చెత్త…వరల్డ్ లో 4th

April 22, 2026 3:25 PM

హైదరాబాద్ నగరంలోని జవహర్‌నగర్ ల్యాండ్‌ఫిల్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మీథేన్ వాయువు విడుదల చేస్తున్న టాప్ 25 చెత్త డంప్ యార్డ్స్ జాబితాలో 4వ స్థానంలో నిలిచింది. తాజా అధ్యయనం ప్రకారం, ఈ డంప్‌యార్డ్ నుంచి ప్రతి గంటకు సుమారు 5.9 టన్నుల మీథేన్ విడుదలవుతోంది.

ఇదే జాబితాలో ముంబైలోని కాంజుర్మార్గ్ ల్యాండ్‌ఫిల్ 12వ స్థానంలో ఉంది. నిపుణుల ప్రకారం, ఒక్క గంటకు 5 టన్నుల మీథేన్ విడుదలైతే అది సుమారు 10 లక్షల SUVs వల్ల కలిగే కాలుష్యానికి సమానమని చెబుతున్నారు.మీథేన్ వాయువు CO₂ కంటే దాదాపు 86 రెట్లు ఎక్కువ హానికరమైనదిగా గుర్తించబడింది. దీంతో నగర చెత్త నిర్వహణ సమస్య ఇప్పుడు గ్లోబల్ క్లైమేట్ థ్రెట్‌గా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media