పులివెందులలో YSజగన్ ప్రజాదర్బార్‌

April 23, 2026 4:42 PM

పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ రెండో రోజు పర్యటన కొనసాగింది. ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు, ప్రజలతో మమేకమయ్యారు.

జై జగన్ నినాదాలతో కార్యాలయం మార్మోగగా, పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయనను కలిసేందుకు తరలివచ్చారు. కార్యకర్తల సమస్యలు, కష్టసుఖాలు అడిగి తెలుసుకున్న జగన్, బాధితులకు ధైర్యం చెప్పారు. “ఏ సమస్య వచ్చినా పార్టీ అండగా ఉంటుంది” అంటూ భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొని పరిస్థితులపై చర్చించారు. కొంతమంది సమస్యలను ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ద్వారా పరిష్కరించేలా సూచనలు ఇచ్చారు.ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడిన జగన్, పలువురిని పేరుపేరునా పలకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యువత, మహిళలు, దివ్యాంగులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనతో సెల్ఫీలు దిగారు.జగన్ పులివెందుల పర్యటనతో ప్రాంతీయ రాజకీయాల్లో మళ్లీ చైతన్యం కనిపిస్తోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media