రవీంద్రభారతిలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు

April 23, 2026 4:54 PM

హైదరాబాద్‌లోని Ravindra Bharathiలో శ్రీశ్రీశ్రీ సగర భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు Ponnam Prabhakar, Vakati Srihari, ఎంపీ Eatala Rajender, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు Jajula Srinivas Goud తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సగరుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుండి చర్యలు తీసుకుంటుందని తెలిపారు.భగీరథ మహర్షి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని కష్టాలను జయించి లక్ష్యాలను సాధించాలన్నారు. “భగీరథ ప్రయత్నం” అనే భావన నేటి సమాజానికి దిశానిర్దేశం చేస్తోందని చెప్పారు. యువత అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media