ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan, మాజీ ముఖ్యమంత్రి Nadendla Bhaskara Rao మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శస్త్రచికిత్స కారణంగా బయటకు రాలేని పరిస్థితిలో ఉండడంతో అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నానని ఆయన బాధ వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా భాస్కరరావు కుమారుడు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి Nadendla Manoharకు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి పరామర్శించారు. ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.భాస్కరరావు గారి సేవలను గుర్తుచేసుకుంటూ ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
