Nalgondaలో ఆర్టీసీ కార్మికుడు, డ్రైవర్ రావుల వెంకన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ నేపథ్యంలో డీఎస్పీ Shivaram Reddy బాధితుడిని పరామర్శించారు.
ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన వెంకన్న, తన సమస్యలను కంటతడి పెట్టుకుంటూ డీఎస్పీకి వివరించాడు. తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ ఘటనతో ఆర్టీసీ కార్మికుల సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని కార్మిక వర్గాలు కోరుతున్నాయి.
