రూ.16 కోట్ల ఇంజెక్షన్ కోసం రెండున్నర నెలల పసికందు పోరాటం

April 24, 2026 11:53 AM

విజయనగరానికి చెందిన రెండున్నర నెలల పసికందు అరుదైన జన్యు వ్యాధి Spinal Muscular Atrophy (SMA Type-1)తో ప్రాణాపాయ స్థితిలో పోరాడుతున్నాడు. ఈ ప్రాణాంతక వ్యాధికి చికిత్సగా ఒకే ఒక్క ఇంజెక్షన్ అవసరం కాగా, దాని మొత్తం ధర సుమారు రూ.16 కోట్లు కావడం కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

తయారీ సంస్థ ధరను కొంత తగ్గించినప్పటికీ, ఇంకా సుమారు రూ.9.5 కోట్లు అవసరమని తల్లిదండ్రులు తెలిపారు. ఇప్పటికే క్రౌడ్‌ఫండింగ్ ద్వారా కొంత సాయం అందినప్పటికీ, పూర్తి మొత్తం సమకూరాల్సి ఉంది.డాక్టర్ల ప్రకారం, బిడ్డకు 6 నెలలు పూర్తయ్యేలోపు ఈ చికిత్స అందితేనే ప్రాణాలను కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో సమయంతో పోటీ పడుతూ తల్లిదండ్రులు దాతలను సహాయం కోసం వేడుకుంటున్నారు.సమాజంలోని దాతలు ముందుకు వచ్చి ఈ పసిప్రాణాన్ని కాపాడాలని కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media