ప్రపంచంలో Nuclear రియాక్టర్లలో అగ్రదేశాలు: USA 1st

April 24, 2026 12:54 PM

ప్రపంచవ్యాప్తంగా అణుశక్తి వినియోగం కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో, అణు రియాక్టర్ల నిర్వహణలో పలు దేశాలు ముందంజలో ఉన్నాయి. International Atomic Energy Agency గణాంకాల ప్రకారం, ప్రపంచంలో 30కి పైగా దేశాల్లో మొత్తం 415 అణు రియాక్టర్లు పనిచేస్తున్నాయి.

అందులో United States 94 రియాక్టర్లతో అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో China 58 రియాక్టర్లతో ఉండగా, అక్కడ మరికొన్ని రియాక్టర్లు నిర్మాణ దశలో ఉన్నాయి.ఇక France (57), Russia (34), South Korea (26) దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. India 24 రియాక్టర్లతో, Canada 17 రియాక్టర్లతో జాబితాలో ఉన్నాయి.అణుశక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు పలు దేశాలు కొత్త రియాక్టర్ల నిర్మాణంపై దృష్టి పెట్టడం గమనార్హం.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media