కెనడాలో జరిగిన టంబ్లర్ రిడ్జ్ కాల్పుల ఘటనపై Sam Altman క్షమాపణలు తెలిపారు. తన సంస్థ OpenAI అనుమానాస్పద ఆన్లైన్ ప్రవర్తనపై పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని అంగీకరించారు.

ఈ ఘటనలో ఫిబ్రవరి 10న బ్రిటిష్ కొలంబియాలోని టంబ్లర్ రిడ్జ్‌లో ఒక 18 ఏళ్ల యువతి కాల్పులకు పాల్పడి ఎనిమిది మందిని హతమార్చింది. కుటుంబ సభ్యులతో పాటు పాఠశాలలో విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు కూడా మృతి చెందగా, మరో 25 మంది గాయపడ్డారు.ఘటనకు ముందు ఆ యువతి ఖాతాను హింసాత్మక కార్యకలాపాలకు సంబంధించిన కారణాలతో జూన్‌లోనే ఓపెన్ఏఐ గుర్తించి బ్యాన్ చేసినట్లు సంస్థ వెల్లడించింది. అయితే, ఆ సమయంలో ఈ సమాచారం చట్ట అమలు సంస్థలకు అందించాల్సిన స్థాయికి చేరలేదని భావించి పోలీసులకు తెలియజేయలేదని పేర్కొంది.ఈ విషయంలో స్థానిక ప్రభుత్వ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, David Eby ఈ క్షమాపణను అవసరమైనదిగా పేర్కొన్నప్పటికీ బాధిత కుటుంబాలకు ఇది సరిపోదని అన్నారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామని సామ్ ఆల్ట్‌మన్ హామీ ఇచ్చారు.
