తెలంగాణలోని Karimnagar జిల్లా ఖాన్‌పూర్‌లో పోలీసు దురుసు ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. బార్బర్ షాపులో పనిచేస్తున్న వ్యక్తిపై ఎస్‌ఐ చందర్ దాడి చేసిన ఘటన చర్చనీయాంశమైంది.
సమాచారం ప్రకారం, బాధితుడు ఎస్‌ఐను “అన్నా” అని సంభోదించగా, ఆగ్రహానికి గురైన ఎస్‌ఐ అతడిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ ఘటనపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పోలీసుల ప్రవర్తనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
