భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి PV Sindhu 2026 థామస్ & ఉబర్ కప్‌లో కొత్త టెక్నాలజీతో ఆకట్టుకున్నారు. డెన్మార్క్‌లోని హోర్సెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆమె “Temple” అనే అత్యాధునిక వేరబుల్ డివైస్‌ను ఉపయోగించడం విశేషం.
ఈ డివైస్‌ను Deepinder Goyal మద్దతుతో అభివృద్ధి చేస్తున్న హెల్త్-టెక్ స్టార్టప్ రూపొందించింది. సాధారణ ఫిట్నెస్ ట్రాకర్స్లా కాకుండా, ఇది మెదడు పనితీరును ట్రాక్ చేయడంపై దృష్టి పెట్టింది.ఈ డివైస్ ముఖ్యంగా మెదడుకు రక్తప్రవాహం (cerebral blood flow), కాగ్నిటివ్ లోడ్ (stress & fatigue levels), అలాగే ఆటగాడి మానసిక-శారీరక పనితీరును రియల్ టైమ్‌లో విశ్లేషిస్తుంది.సింధు ఈ డివైస్‌ను డెన్మార్క్ ప్లేయర్ Line Christophersen పై జరిగిన మ్యాచ్‌లో వినియోగించడం ద్వారా ప్రొఫెషనల్ స్థాయిలో తొలిసారి ఇది కనిపించింది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ రీసెర్చ్ దశలో ఉండి, ఇంకా ప్రజలకు అందుబాటులో లేదు.ఈ కొత్త ప్రయోగం భవిష్యత్తులో క్రీడాకారుల పనితీరు, మెదడు ఆరోగ్యం నిర్వహణలో గేమ్-చేంజర్‌గా మారే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
