Hyderabad లోని బంజారాహిల్స్ MLA కాలనీ రోడ్ నం.12లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. IIIC సమీపంలో ఓ వ్యక్తి ఇంట్లోకి అక్రమంగా చొరబడి, అక్కడి సిబ్బందిని బెదిరించిన ఘటన కలకలం రేపింది.
సమాచారం ప్రకారం, పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఆ వ్యక్తి ఈ ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అనంతరం సిబ్బందిని బెదిరిస్తూ అక్కడి నుంచి పరారైనట్లు చెబుతున్నారు.ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
