H-1B వీసాలపై US కాంగ్రెస్‌లో కొత్త బిల్లు…

April 27, 2026 11:42 AM

అమెరికాలో H-1B వీసాలపై కీలక మార్పులకు దారితీసే కొత్త బిల్లు చర్చకు దారి తీసింది. United States Congress లో ప్రవేశపెట్టిన “End H-1B Visa Abuse Act of 2026” ప్రస్తుతం పెద్ద డిబేట్‌గా మారింది.

ఈ బిల్లు ప్రకారం H-1B వీసాలకు 3 సంవత్సరాల విరామం ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నారు. విదేశీ ఉద్యోగుల వల్ల అమెరికన్ల ఉద్యోగాలు కోల్పోతున్నాయని కొందరు వాదిస్తున్నారు. అలాగే, వార్షిక H-1B కోటాను 65,000 నుంచి 25,000కు తగ్గించడం, కనీస జీతాన్ని $200,000గా నిర్ణయించడం వంటి కీలక మార్పులు సూచించారు.ఇంకా డిపెండెంట్స్‌ను తీసుకురావడంపై పరిమితులు, లాటరీ సిస్టమ్ స్థానంలో వేతనాధారిత ఎంపిక విధానం, అమెరికన్ వర్కర్లకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి నియమాలు కూడా ఈ బిల్లులో ఉన్నాయి. స్టాఫింగ్ కంపెనీల పాత్రను తగ్గించడం, ఒకేసారి పలువురు ఉద్యోగాలు చేపట్టడంపై నిషేధం, పర్మనెంట్ రెసిడెన్సీ అవకాశాలను పరిమితం చేయడం వంటి అంశాలు కూడా చేర్చారు.ఈ మార్పులు అమలులోకి వస్తే ముఖ్యంగా భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్‌పై పెద్ద ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media