కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్‌లో భార్గవి డబుల్ మెడల్ విజయం

April 27, 2026 3:47 PM

సమోవాలో జరిగిన కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో విజయనగరం జిల్లా కొండవెలగాడకు చెందిన బెల్లాన భార్గవి అద్భుత ప్రదర్శనతో రెండు పతకాలు సాధించింది. యూత్ విభాగంలో గోల్డ్ మెడల్, జూనియర్ విభాగంలో సిల్వర్ మెడల్ గెలుచుకుని అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటింది.

భార్గవి మొత్తం 180 కేజీల బరువు ఎత్తి (స్నాచ్ 78 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ 102 కేజీలు) ఈ విజయాన్ని అందుకుంది. ఆమె కోచ్ వల్లూరి శ్రీనివాసరావు సహకారంతో సాధించిన ఈ ఘనతపై గ్రామస్థులు, జిల్లా మరియు రాష్ట్ర వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు.ఈ విజయంతో జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media