నల్లగొండ జిల్లాలో చిన్న పిల్లలను అక్రమంగా దత్తత తీసుకోవడం చట్టరీత్యా నేరమని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ హెచ్చరించారు. మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక”లో భాగంగా ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు బాలల భద్రత, రక్షణ మరియు మత్తు పదార్థాల వ్యతిరేకంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

దత్తత తీసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా చట్టబద్ధ విధానాలను అనుసరించాలని, ఇందుకోసం కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మరింత సమాచారం కోసం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం లేదా బాలరక్ష భవన్‌ను సంప్రదించాలని సూచించారు.
