పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఎంఐఎం పార్టీకి బెంగాల్ ఓటర్లు కోలుకోలేని షాక్ ఇచ్చారు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఈ పార్టీ పోటీ చేసిన 12 స్థానాల్లోనూ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. అమ్ జనతా ఉన్నాయున్ పార్టీ నేత హుమయూన్ కబీర్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగం లోకి దిగింది ఎంఐఎం పార్టీ. అయితే ఒక స్టింగ్ ఆపరేషన్‌లో హుమయూన్ కబీర్ దొరికిపోవడంతో ఎంఐఎంకు ఏ మాత్రం కలిసి రాలేదు. బీజేపీకి ప్రయోజనం చేకూర్చేందుకే తాము ముస్లిం ఓట్లను చీలుస్తున్నామని ఆయన ఆ ఆపరేషన్‌లో వ్యాఖ్యానించాడు. ఈ వివాదం తర్వాత ఎంఐఎం ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్నప్పటికీ, ఓటర్లు మాత్రం ఎంఐఎంను హుమాయున్ కబీర్ భాగస్వామిగానే పరిగణించి తిరస్కరించారు.
