పంజాబ్ కింగ్స్‌తో ఉప్పల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్ కూపర్ కానెల్లి మాత్రమే ఒంటరి పోరాటం చేశాడు. 59 బంతుల్లోనే 107 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో పంజాబ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి వచ్చింది. 11 మ్యాచ్‌లకు గాను 7 మ్యాచ్‌లు గెలిచి 14 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది.
మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ 13 బంతుల్లో రెండు పోర్లు, రెండు సిక్సులతో 35 పరుగులు, ట్రావిస్ హెడ్ 19 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సులతో 38 పరుగులతో చెలరేగారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 55 పరుగులు, హెన్రిచ్ క్లాసెన్ 43 బంతుల్లో 69 పరుగులు, నితీశ్ రెడ్డి 13 బంతుల్లో 29 పరుగులతో భారీ స్కోరు అందించారు.
