క్లారిటీ ఇచ్చిన స్టాలిన్.. అది విజయ్ చేస్తే సంతోషం

May 7, 2026 9:22 AM

తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకేతో కలిసి డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు డీఎంకే చర్చలు జరుపుతోందంటూ వస్తున్న వదంతులను స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ప్రజలు మార్పు కోరుకున్నారని, వారి అభీష్టాన్ని శిరసావహిస్తామని స్టాలిన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్త పార్టీ అధికారంలోకి రావాలన్న ప్రజల తీర్పును తమ పార్టీ గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావడం గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తడం గానీ తాము కోరుకోవడం లేదని స్టాలిన్ అన్నారు.

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టీవీకే (TVK) అధినేత విజయ్‌కి అవకాశం ఇస్తామని, ఆరు నెలల పాటు వారిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వారి పాలనను గమనిస్తామని ఎం.కె. స్టాలిన్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పాఠశాల విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకం’ ‘మహిళలకు నెలకు రూ. 1,000 ఆర్థిక సాయం’ వంటి ముఖ్యమైన పథకాలను కొత్త ప్రభుత్వం కూడా కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామని విజయ్ ఇచ్చిన హామీని అమలు చేయడం కష్టమని, కనీసం తాము ఇచ్చినట్లు రూ. 1,000 అయినా ఇవ్వాలని స్టాలిన్ సూచించారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదికి 6 ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న టీవీకే హామీని నెరవేర్చలేరని తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఒకవేళ చేస్తే సంతోషిస్తామన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media