ఇక వారికి గ్యాస్ సబ్సిడీ కట్

May 12, 2026 11:57 AM

కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వార్షిక ఆదాయం రూ. 10 లక్షలు దాటిన కుటుంబాలకు సబ్సిడీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇంతకు ముందు వినియోగదారుల వ్యక్తిగత డిక్లరేషన్‌పై ఆధారపడి సబ్సిడీని కట్ చేసేవారు. ఇకపై నేరుగా పాన్ కార్డ్ డేటా ఆధారంగా ఐటీ రికార్డులను తనిఖీ చేస్తున్నారు. కేవలం కనెక్షన్ ఉన్న వ్యక్తి ఆదాయమే కాకుండా, భార్యాభర్తల్లో ఎవరి ఆదాయం రూ. 10 లక్షలు దాటినా ఆ కుటుంబం సబ్సిడీకి అనర్హమవుతుంది. ఐటీ రికార్డుల ప్రకారం అనర్హులుగా తేలిన వారికి ఆయిల్ కంపెనీలు మెసేజ్‌లు పంపిస్తున్నాయి. 7 రోజుల్లోగా అభ్యంతరాలు తెలపకపోతే ఆటోమేటిక్‌గా సబ్సిడీ కట్ అయిపోతుంది. ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ లబ్ధిదారులకు ఈ రూల్ వర్తించదు. వారికి వచ్చే సబ్సిడీ యథావిధిగా అందుతుంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media