మైనర్‌పై లైంగిక వేధింపుల కేసులో బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు చేయగా అతని కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. కేసు నమోదైనప్పటి నుంచి భగీరథ్ అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే రెండుసార్లు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాలన్నా స్పందించకపోవడంతో, అతనిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు.
నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు కొనసాగిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా కేంద్ర సహాయ మంత్రి నివాసంలో సైబరాబాద్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అలాగే కరీంనగర్‌లో నివసించే భగీరథ్ మేనమామ వంశీకృష్ణకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ, కరీంనగర్ తో పాటు హైదరాబాద్ వంటి నగరాల్లో ఐదు ప్రత్యేక బృందాలు భగీరథ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు
