హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న ఉగ్రవాది

May 18, 2026 4:11 PM

లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది హెయిర్ ప్లాంటేషన్ కోసం తన ఉగ్రదాడిని వాయిదా వేసుకున్నాడు. జమ్ము కశ్మీర్ పోలీసులు గత నెల జరిపిన ఆపరేషన్‌లో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు మహమ్మద్ ఉస్మాన్ జాట్, అబు హురెయిరాను అరెస్టు చేసి, దర్యాప్తు కోసం జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులకు అప్పగించారు.

ఎన్ఐఏ అధికారులు ఇటీవల ఉస్మాన్‌ జాట్ ను విచారించగా నివ్వెరపోయే విషయం వెలుగు చూసింది. లాహోర్‌కు చెందిన ఉస్మాన్ లష్కరే ఉగ్రవాద సంస్థలో శిక్షణ తీసుకున్నాడు. సరిహద్దు దాటి కశ్మీర్ లోయలోకి జొరబడ్డాడు. జమ్ము కశ్మీర్ వెలుపల స్లీపర్ సెల్స్‌ను ఏర్పాటు చేసే పనిని తమకు అప్పగించినట్లు విచారణలో అంగీకరించాడు. తనకు జుత్తు ఊడిపోవడంతో బట్టతల సమస్యతో బాధపడుతున్నానని, దీంతో తనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందని అతను అధికారులకు తెలియజేశాడు. మరో ఉగ్రవాది అబు హురెయిరా సహాయంతో చికిత్స తీసుకున్నట్లు అతడు విచారణలో తెలిపాడు. శ్రీనగర్‌లోని ఒక క్లినిక్‌లో ఉస్మాన్ జాట్ రహస్యంగా హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నాడు. చికిత్స పూర్తయ్యాక ఉస్మాన్ జాట్ జమ్మూకు చేరుకున్నాడు. అక్కడి నుంచి బస్సులో పంజాబ్ చేరుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఆ తర్వాత అతడు నకిలీ ఆధార్, పాన్ కార్డు, పాస్‌పోర్టు కోసం ప్రయత్నించాడు. వాటి సాయంతో దేశం విడిచి పారిపోవాలని ప్రణాళిక వేసుకున్నాడు. అయితే అనుకున్న విధంగా ప్లాన్ సాగలేదు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media