Pune: కొడుకు పుట్టలేదనే కోపం, పరాయి పురుషుడితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భార్య జననాంగాలపై యాసిడ్ పోశాడు ఓ వ్యక్తి. కనీసం కనికరం చూపించకుండా 15 రోజుల పాటు ఇంట్లోనే బంధించి వైద్యం కూడా అందకుండా చేసిన మృగాడు. ఈ ఘటన పుణెలో వెలుగుచూసింది. ఏప్రిల్ 20న నిందితుడు మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. కోపంతో టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్ తీసుకొచ్చి ఆమె ప్రైవేట్ పార్ట్స్‌పై పోశాడు. బాధితురాలు నొప్పితో కేకలు వేస్తూ పారిపోవాలని చూసినా కూడా కనీసం పట్టించుకోలేదు. ఎవరికైనా చెబితే చంపేస్తానని నిందితుడు భార్యను బెదిరించాడు. చివరికి మే 9న భర్త పనికి వెళ్లిన సమయంలో ఆమె తన ఇద్దరు కుమార్తెలను తీసుకుని పుట్టింటికి పారిపోయింది. తల్లిదండ్రులకు జరిగిన దారుణాన్ని వివరించింది. చివరికి పోలీసుల దాకా వెళ్ళింది.
