ధోని ఆడట్లేదు.. ఓ క్లారిటీ వచ్చింది

May 18, 2026 7:49 PM

Chennai: మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ గురించి ఊహాగానాలకు ఓ ఫుల్ స్టాప్ పడింది. ధోని జట్టుతో పాటే ఉన్నాడు.. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్‌ ఆడేంత ఫిట్‌నెస్‌తో లేడని రుతురాజ్‌ గైక్వాడ్‌ టాస్‌ గెలిచిన అనంతరం చెప్పాడు. టాస్ సమయంలో ధోని రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అభిమానులు ఎంతో ఆనందంతో చప్పట్లు కొట్టారు మైదానంలో.

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న కీలక పోరులో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచింది. జట్టులో గుర్జపనీత్ స్థానంలో అకీల్ హోసేన్‌ను తీసుకున్నట్లు చెన్నై కెప్టెన్ వెల్లడించాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరన్ రవిచంద్రన్, నితీశ్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్ (కెప్టెన్), శివంగ్ కుమార్, ఎషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే.

చెన్నై సూపర్ కింగ్స్
సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, అకీల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, స్పెన్సర్ జాన్సన్.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media