తెలంగాణపై భానుడి పగ!!

May 18, 2026 8:02 PM

తెలంగాణ రాష్ట్రంలో రానున్న వారం రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ అధికంగా ఉండనున్నాయి. ఉత్తర ప్రాంత జిల్లాల్లో చాలాచోట్ల 45 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వడగాలులు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మండుటెండల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా బయట తిరిగితే వాంతులు, వికారంతో పాటు శరీరం పొడిగా, ఎర్రబారే అవకాశముందని వైద్యులు తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media