బంగారం, వెండి ధరల్లో మార్పులు ఇప్పుడు సాధారణంగా మారాయి. ఒకరోజు తగ్గితే.. మరుసటి రోజు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయినప్పటికీ కొనుగోలు దారులు మాత్రం పెద్దగా వెనక్కి తగ్గడం లేదు. శుభకార్యాలు, పెళ్లిళ్లు వంటి అవసరాల వల్ల ఎంత ధర ఉన్నా కొనుగోళ్లు కొనసాగుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ ఏడాది పాటు బంగారం కొనొద్దని సూచించినా.. భారతీయ కుటుంబాల్లో సంప్రదాయాల కారణంగా కొనుగోళ్లు ఆగడం లేదు. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటం కూడా బంగారం మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది.
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ హోర్ముజ్ జలసంధి పరిణామాలు ఇంకా పూర్తిగా సద్దుమణగలేదు. దీంతో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై ఆందోళనలు పెరగడంతో బంగారం కొనుగోళ్లలో కొంత మందగమనం కనిపిస్తోంది.
పెట్టుబడిదారులు కూడా బంగారం, వెండి ధరల్లో ఉన్న అనిశ్చితి కారణంగా మదుపు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
ఈరోజు దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నమోదైన ధరలు ఇలా ఉన్నాయి.
- పది గ్రాముల బంగారం ధరపై రూ.750 పెరిగింది
- కిలో వెండి ధరపై రూ.100 తగ్గింది
- 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,43,960గా నమోదైంది
- 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,57,050కు చేరింది
- కిలో వెండి ధర రూ.2,99,900గా ట్రేడ్ అవుతోంది

