ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేసులో కేకేఆర్ ఇంకా నిలబడే ఉంది. అన్నీ కలిసి వస్తే ప్లే ఆఫ్స్ కు చేరుకోవచ్చు. ముంబైతో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. వాంఖేడే స్టేడియం వేదికగా సాగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. 6 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన ముంబై కష్టాల్లో పడింది. మధ్యలో వర్షం కూడా మ్యాచ్‌కి అంతరాయం కలిగించింది. కార్బిన్ బాష్ 18 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సులు, మూడు ఫోర్లు ఉన్నాయి. హార్దిక్ పాండ్య 27 బంతుల్లో 26 పరుగులు, తిలక్ వర్మ 32 బంతుల్లో 20 పరుగులు చేశారు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ మొదట్లో రెండు వికెట్లు కోల్పోయి తడబడింది. అయితే మనీష్ పాండే 33 బంతుల్లో 45 పరుగులు చేసి మ్యాచ్ ను కేకేఆర్ వైపు తిప్పాడు. పావెల్ 30 బంతుల్లో 40 పరుగులతో రాణించడంతో కేకేఆర్ కు విజయం దక్కింది.

