రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మంచి మంచి ఇన్నింగ్స్ ఆడుతూ ఐపీఎల్ లో దూసుకుపోతున్నాడు. 15 ఏళ్ల వయసులోనే వరుసగా మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై కేవలం 38 బంతుల్లోనే 10 సిక్స్‌లు, 7 ఫోర్లతో ఏకంగా 93 పరుగులు చేసి.. రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే వైభవ్ ఆడుతున్న భారీ షాట్లపై గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించాయి. అతడి బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందంటూ పాక్ క్రికెట్ విశ్లేషకుడు నౌమన్ నియాజ్ చెప్పడంపై చర్చ జరుగుతూ ఉంది.
కైఫ్ ఈ చిప్ ఆరోపణలపై స్పందించారు. అసలు బ్యాట్‌లో ఏఐ చిప్ ఉంటే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. అలాంటి చిప్ ఉంటే సెంచరీ కొట్టొచ్చనే హామీ ఎవరైనా ఇవ్వగలరా? నాని అడిగారు. ఆ హామీ ఎవరైనా ఇస్తే తాను కామెంటరీనే వదిలేస్తానని చెప్పుకొచ్చారు. వైభవ్ ఇంత బాగా ఆడుతున్నప్పుడు అది కేవలం ప్రతిభ వల్లేనన్నారు. ఏడేళ్ల వయసు నుంచి వైభవ్ కష్టపడి తన ఆటను మెరుగుపరుచుకున్నాడని, దయచేసి ఆ కుర్రాడికి క్రెడిట్ ఇవ్వాలన్నారు కైఫ్.

