బంగారం ధరలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది సాధారణ అంచనా కాదు. మార్కెట్ నిపుణులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్ పెద్దగా లేకపోయినా, కొనుగోళ్లు మందగించినప్పటికీ బంగారం, వెండి ధరలు పైకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒకరోజు పెరుగుతుండగా, మరోరోజు తగ్గుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు కూడా అయోమయంలో పడుతున్నారు. ధరలు ఎటు వెళ్తాయో అంచనా వేయలేక కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్నంతసేపు మార్కెట్లలో అస్థిరత కనిపిస్తోంది. హోర్ముజ్ జలసంధి మూసివేతతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. దాని ప్రభావం బంగారం మార్కెట్‌పైనా పడుతోంది.
అంతర్జాతీయ పరిణామాలు, విదేశాల్లో మాంద్యం, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం కూడా ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కూడా మార్కెట్లో అనిశ్చితిని పెంచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్‌కు కూడా ప్రస్తుతం విరామం వచ్చింది. అధిక జ్యేష్ఠ మాసం కారణంగా శుభకార్యాలు జరగడం లేదు. దీంతో ఆభరణాల కొనుగోళ్లు కూడా తగ్గాయి. మదుపుదారుల్లో కొందరు బంగారంపై పెట్టుబడి ప్రస్తుతం సురక్షితం కాదన్న అభిప్రాయంతో ఉన్నారు.
ఈరోజు దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నమోదైన ధరలు ఇలా ఉన్నాయి.
- 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – రూ.1,46,610
- 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – రూ.1,59,960
- కిలో వెండి ధర – రూ.2,90,100
మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.

