హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇషాన్ కిషన్ (79), అభిషేక్ శర్మ (56), హెన్రిచ్ క్లాసెన్ (51) అద్భుత అర్ధ సెంచరీలతో విరుచుకుపడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అభిషేక్ శర్మ కేవలం 22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు. ఇక క్లాసెన్ కేవలం 24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి (12 బంతుల్లో 29 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో సన్‌రైజర్స్ స్కోరు 250 మార్కును దాటింది.

