చంద్ర‌బాబు ఇంటిని ముట్టడిస్తాం: కవిత

May 26, 2026 7:22 AM

ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తే సీఎం చంద్ర‌బాబు ఇంటిని ముట్టడిస్తామని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను జనసేన పార్టీ, ఏపీ పోలీసులు, అక్కడి ప్రభుత్వం కేసుల పేరుతో వేధిస్తున్నాయని మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా విశ్లేషణలు చేసే నాగేశ్వర్‌పై ఉద్దేశపూర్వకంగానే అక్రమ కేసులు బనాయించి కుట్రలు చేస్తున్నారని, తెలంగాణ సమాజం, తెలుగు ప్రజలు గౌరవించే ఒక మేధావిపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో నాగేశ్వర్‌ను అరెస్ట్ చేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media