హైదరాబాద్: బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. కొన్ని రోజులు పెరుగుతుండగా, మరికొన్ని రోజులు తగ్గుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పుడే కొనాలా? లేక మరికొంత కాలం వేచి చూడాలా? అనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు.
పశ్చిమాసియా ఉద్రిక్తతల తర్వాత బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ఆర్థిక అనిశ్చితి, పొదుపులపై దృష్టి పెరగడంతో బంగారం కొనుగోళ్లను చాలామంది వాయిదా వేస్తున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు తగ్గడం కూడా డిమాండ్‌పై ప్రభావం చూపుతోంది.
అయితే డిమాండ్ తగ్గినా ధరలు మాత్రం పైబాటలోనే ఉన్నాయి. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో నమోదైన ధరలు ఇలా ఉన్నాయి.
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం: రూ.1,44,510
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం: రూ.1,57,650
- కిలో వెండి: రూ.2,90,100
మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.

