హైదరాబాద్‌లో నంబర్ ప్లేట్లు మార్చిన ఇద్దరి అరెస్ట్

May 31, 2026 7:54 PM
hyd-police

హైదరాబాద్‌లో ట్రాఫిక్ చలాన్ల నుండి తప్పించుకోవడానికి తమ ద్విచక్ర వాహనాల నంబర్ ప్లేట్లను మార్చిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు వేర్వేరు కేసుల్లో పట్టుకున్నారు. చిక్కడపల్లికి చెందిన కొలిమి యాదయ్య (52) అనే వ్యక్తి తన హోండా యాక్టివాపై ఉన్న 49 పెండింగ్ చలాన్ల (రూ. 20,815) నుంచి తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్‌ను ట్యాంపరింగ్ చేశాడు. అక్షరాలను మార్చేందుకు నంబర్ ప్లేట్ పై స్టిక్కర్ అంటించి అసలు నంబరైన TS 09 GF 1079 ను TS 09 GE 1079 గా మార్చాడు. అతడిని తనిఖీల్లో పట్టుకున్న పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు.

చంచల్‌గూడకు చెందిన సయ్యద్ హుస్సేన్ మెహదీ అలియాస్ ఇజాన్ (22) అనే డ్రైవర్, తన హోండా డియో బండికి ఏకంగా నకిలీ నంబర్ ప్లేట్ (TS 11 EK 0593) అమర్చాడు. తన వాహనాన్ని ఆర్టీఏ (RTO) వద్ద రిజిస్టర్ చేయకుండా, ఫైన్లు, ఫైనాన్స్ సమస్యల నుండి తప్పించుకోవడానికి వేరొకరి నంబర్‌ను వాడాడు. దీనివల్ల ఇతను చేసిన ట్రాఫిక్ ఉల్లంఘనలకు అమాయకుడైన అసలు యజమానికి చలాన్లు వెళ్లాయి. ఈ రెండు ఘటనల్లోనూ పోలీసులు నిందితులపై ‘భారతీయ న్యాయ సంహిత (BNS)’, ‘మోటారు వాహనాల చట్టం’ కింద కేసులు నమోదు చేశారు. సీసీటీవీ (CCTV), ANPR కెమెరాల ద్వారా వాహనాల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, నకిలీ నంబర్ ప్లేట్లను వాడటం లేదా ట్యాంపరింగ్ చేయడం కఠినమైన చట్టపరమైన నేరమని ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను హెచ్చరించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media