హైదరాబాద్: చమురు సంస్థలు మరోసారి వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచాయి. ప్రతి నెలా జరిగే ధరల సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి.
తాజా పెంపుతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.42 పెరిగింది. కోల్కతాలో రూ.53.50, హైదరాబాద్లో రూ.52, ముంబైలో రూ.43.50 చొప్పున పెరిగాయి.
అలాగే 5 కిలోల ఎఫ్టీఎల్ (ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ) సిలిండర్ ధరపై రూ.11 పెంచాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై అదనపు భారం పడనుంది.
అయితే గృహ వినియోగదారులకు ఈసారి ఊరట లభించింది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో ఇంటి అవసరాలకు ఉపయోగించే సిలిండర్ల ధరలు యథాతథంగా కొనసాగనున్నాయి.


