బైక్‌పై బోల్తా పడిన మినీబస్సు.. తల్లి, కుమార్తె మృతి

June 1, 2026 12:08 PM

ఖర్గోన్ (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ, ఆమె 16 ఏళ్ల కుమార్తె మృతి చెందారు. మరో 17 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

జిల్లా కేంద్రానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైటాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మగరియా గ్రామం సమీపంలో ఖండ్వా–బరోడా జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఎదురుగా వస్తున్న కారును తప్పించేందుకు ప్రయత్నించిన మినీబస్సు డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని జైటాపూర్ పోలీస్‌స్టేషన్ హౌస్‌ ఆఫీసర్‌ సుదర్శన్ కలోసియా తెలిపారు. అదుపు తప్పిన మినీబస్సు ఓ మోటార్‌సైకిల్‌పై బోల్తా పడిందన్నారు. ఈ ఘటనలో మహిళ, ఆమె కుమార్తె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 17 మంది గాయపడ్డారని చెప్పారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media